గతంలో ప్రతిరోజూ సుమారు 150 నౌకలు
ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం
టెహ్రాన్: ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం మోదలై నెలరోజుకుపైనే అయినా.. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ఇంధన రవాణా మార్గాలలో ఒకటైన హార్ముజ్ జలసంధి గుండా నౌకా రవాణా గణనీయంగా పడిపోయింది. బ్లూమ్‌బెర్గ్ తాజాగా విడుదల చేసిన డేటాలో వెల్లడైంది. నివేదిక ప్రకారం.. సంక్షోభానికి ముందు స్థాయిలతో పోలిస్తే ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకల సంఖ్య 95 శాతం వరకు తగ్గింది. కేవలం కొన్ని నౌకలు మాత్రమే నడుస్తున్నవి. వాటిలో చాలా వరకు ఇరాన్ జెండా ఉన్నవి లేదా ఇరాన్‌తో సంబంధం ఉన్న దేశాలకు చెందిన నౌకలు మాత్రం ప్రయాణించగలుగుతున్నాయి.గతంలో ప్రతిరోజూ సుమారు 150 నౌకలు ఈ కీలకమైన మార్గాన్ని ఉపయోగించేవి. సముద్ర రవాణాలో ఈ తీవ్రమైన క్షీణత, ప్రపంచంలోని కీలకమైన చమురు , గ్యాస్ కారిడార్లలో ఒకదాని గుండా వాణిజ్య రవాణా దాదాపు పూర్తిగా నిలిచిపోయిందని సూచిస్తుంది. ఈ ధోరణి ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతోంది.



