- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సినీ నటుడు శివాజీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన ‘దండోరా’ సినిమా వేడుకలో నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తుల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన ప్రసంగం మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ మహిళా కమిషన్, దీనిని సుమోటో కేసుగా స్వీకరించింది. ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం శివాజీ వ్యాఖ్యలు మహిళల పట్ల అవమానకరంగా ఉన్నాయని నిర్ధారించుకుని ఆయనకు నోటీసులు జారీ చేసింది.
- Advertisement -



