- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని మారుమూల గ్రామం పెద్దగుల్ల గ్రామంలో గ్రామ పెద్దలు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు శివాజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ మహారాజ్ పోరాట పటిమ, ధైర్య సాహసాలు అమోఘమని అన్నారు. దేశ ప్రజల రక్షణ కొరకు చత్రపతి శివాజీ మహారాజ్ ప్రదర్శించిన ధైర్య సాహసాలను యువత నింపుకొని ముందుకెళ్లాలని అన్నారు. ధర్మరక్షణకు ఆయన ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.
- Advertisement -



