- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని సావర్గావ్ తండాలో గిరిజనులు ఆధ్వర్యంలో సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాండ పెద్దలు మహిళలు చిన్నలు పెద్దలు కలిసి సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జయంతి వేడుకలను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సేవాలాల్ అడుగుజాడలో నడవడం వల్ల గిరిజనులు దినదిన అభివృద్ధి బాటలో పయనిస్తున్నామని గ్రామ పెద్దలు అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన పెద్దలు, గ్రామవాసులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



