– జాతీయస్థాయి పురస్కారాన్ని అందుకోవడం అభినందనీయం.
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు వెలుగు జాతీయ పురస్కారాన్ని పొందిన సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్లోక ఇన్నోవేటివ్ పాఠశాల సెక్రటరీ,కరస్పాండెంట్ జలిగామ శ్రీకాంత్ సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని, రక్తదానం ప్రాణదానంతో సమానమని రక్తదానానికి ముందుకు వస్తున్న రక్తదాతలకు,సహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. శ్లోక పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసారు.
డాక్టర్ బాలు ను సన్మానించిన శ్లోక పాఠశాల యాజమాన్యం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES