Monday, July 14, 2025
E-PAPER
Homeఆటలుసబలెంకకు షాక్‌

సబలెంకకు షాక్‌

- Advertisement -

– సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ పరాజయం
– బెర్లిన్‌ ఓపెన్‌ 2025 టెన్నిస్‌
బెర్లిన్‌ (జర్మనీ) :
బెలారస్‌ భామ, ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ అరినా సబలెంక సూపర్‌ జోరుకు చెక్‌ పడింది. బెర్లిన్‌ ఓపెన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న సబలెంకకు సెమీస్‌లో పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో చెక్‌ రిపబ్లిక్‌ అమ్మాయి మార్కెట ఒండ్రుసోవ 6-2, 6-4తో వరుస సెట్లలో అరినా సబలెంకపై మెరుపు విజయం సాధించింది. నాలుగు ఏస్‌లు, నాలుగు బ్రేక్‌ పాయింట్లతో రెచ్చిపోయిన మార్కెట మహిళల సింగిల్స్‌ టైటిల్‌ పోరుకు చేరుకుంది. పాయింట్ల పరంగా 72-55తో సబలెంకపై ఒండ్రుసోవ ఆధిపత్యం సాధించింది. సబలెంక 4 ఏస్‌లు కొట్టినా.. ఒక్క బ్రేక్‌ పాయింట్‌ మాత్రమే సాధించింది. రెండు సెట్లలోనూ మార్కెటకు గట్టి పోటీ ఇవ్వటంలో సబలెంక తేలిపోయింది. మరో సెమీఫైనల్లో చైనా అమ్మాయి వాంగ్‌ 6-4, 6-1తో సమ్సోనోవపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. నేడు మహిళల సింగిల్స్‌ ఫైనల్లో వాంగ్‌తో ఒండ్రుసోవ పోటీపడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -