- Advertisement -
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో భక్తులు మృతిచెందడం అత్యంత విషాదకరమని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఏకాదశి పండుగ సందర్భంగా తెలంగాణలోని అన్ని దేవాలయాల్లో క్యూ లైన్లకు తగిన ఏర్పాట్లు, కనీస వసతులను కల్పించేందుకు ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ హరీష్‌ను మంత్రి ఆదేశించారు.
- Advertisement -



