– స్పోర్ట్స్ కిట్ కూడా…
– ప్రస్తుత విద్యాసంవత్సరంలో అమలు
– రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ల్లో చదువుతున్న విద్యార్థులకు బూట్లు (ష్యూ) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్పోర్ట్ కిట్ కూడా ఇచ్చేందుకు అంగీకరించింది. ప్రస్తుత విద్యాసంవత్సరం (2025-26)లోనే విద్యార్థులకు బూట్లు, స్పోర్ట్స్ కిట్ ఇవ్వనుంది. సమగ్ర శిక్ష పథకంలో భాగంగా కేజీబీవీల్లోని విద్యార్థులకు బూట్లు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుత విద్యాసంవత్సరంలో విద్యార్థులకు బూట్లతోపాటు స్పోర్ట్స్ కిట్ కూడా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 31 జిల్లాల్లో 495 కేజీబీవీలున్నాయి. వాటిలో ఆరు నుంచి 12వ తరగతి వరకు 1,24,153 మంది విద్యార్థులు చదువుతున్నారు. సమగ్ర శిక్ష పథకంలో ఉన్న కేజీబీవీలకు అయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను భరిస్తాయి. విద్యాపరంగా వెనుకబడిన జిల్లాల్లో కేజీబీవీలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా అమ్మాయిల విద్యను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. విద్యార్థులకు రెసిడెన్షియల్‌లో విద్యనందిస్తాయి. వారికి ఉచితంగా భోజనం, వసతితో పాటు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫారాలను అంది స్తాయి. ఇప్పుడు అమ్మాయిలకు బూట్లతోపాటు స్పోర్ట్స్ కిట్ కూడా అందనుంది. అమ్మాయిలకు పూర్తిస్థాయిలో రక్షణ ఉంటుంది. సీసీ కెమెరాల నిఘా ఉంటు ంది. మహిళా సిబ్బంది మాత్రమే పనిచేస్తారు. రాత్రిపూట వాచ్‌వుమెన్ కూడా అందుబాటులో ఉంటారు. విద్యార్థులు చదువుల్లో మరింత రాణించాలని విద్యాశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కేజీబీవీ విద్యార్థులకు బూట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES