- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: థాయ్‌లాండ్‌లో ఓ స్కూల్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. సోంఘ్‌క్లా ప్రావిన్స్‌లో ఉన్న స్కూల్‌లోకి ఒక దుండగుడు జొరబడి విద్యార్థులు, ఉపాధ్యాయులపై విచక్షణ రహితంగా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, థాయ్‌లాండ్‌లోని ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు 18 సంవత్సరాల కుర్రాడు అని, అతడు పలుమార్లు తన తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడని ఒక పోలీసు అధికారి వెల్లడించారు. నిందితుడు తుపాకీతో ఫటోంగ్ ప్రథాన్ ఖిరివాట్ పాఠశాలలోకి ప్రవేశించి కాల్పులు జరిపాడని తెలిపారు.
- Advertisement -



