Monday, March 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంటెక్సాస్‌ బార్‌లో కాల్పులు

టెక్సాస్‌ బార్‌లో కాల్పులు

- Advertisement -

ముగ్గురి మృతి..14 మందికి గాయాలు

ఆస్టిన్‌ : అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్ర రాజధాని ఆస్టిన్‌లో ఒక బార్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో కాల్పులకు పాల్పడ్డ సాయుధుడు కూడా ఉన్నాడు. ఆదివారం తెల్లవారుజామున ఈ కాల్పుల ఘటన జరిగినట్టు నగర పోలీస్‌ చీఫ్‌ లిసా డేవిస్‌ వెల్లడించారు. ప్రసిద్ధ బీర్‌ గార్డెన్‌ అయిన బుఫోర్డ్స్‌లో ఒక వ్యక్తి కాల్పులకు తెగబడతున్నట్లు తమకు సమాచారం వచ్చిన వెంటనే అక్కడకు చేరుకున్నామని పోలీసు అధికారి తెలిపారు. సాయుధుడు తమపై కూడా కాల్పులు ప్రారంభించగా ఎదురుకాల్పుల్లో అతని కాల్చిచంపినట్లు తెలిపారు. గాయపడిన 14 మందిని ఆస్పత్రికి తరలించామని, వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -