భద్రతా సిబ్బంది, టెర్రరిస్టులకు మధ్య గన్‌ఫైట్
ఏడుగురు పోలీసులు, ఆరుగురు ఉగ్రవాదులు మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పుల్లో ఇరు వర్గాల నుంచి మరణాలు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి జరిగిన క్లియరెన్స్ ఆపరేషన్‌లో మరో ముగ్గురు ఉగ్రవాదులు మరణించగా, ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తంగా ప్రాణాలు కోల్పోయిన పోలీసులు సంఖ్య ఏడుకు, ఉగ్రవాదుల సంఖ్య ఆరుకు చేరుకున్నది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తాజాగా వాయువ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పోలీస్ శిక్షణా కేంద్రం పాఠశాలలో జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి తర్వాత.. పోలీసులు, ఉగ్రవాదులకు మధ్య ఐదు గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో మరో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు చెప్పారు. కాగా అంతకముందు డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని పోలీస్ ట్రైనింగ్ స్కూల్‌పై దాడి తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. ముందుగా ఒక పోలీసు మరణించినట్టు సమాచారం అందింది. ఆ తర్వాత దాడిలో మరణించిన పోలీసుల సంఖ్య ఏడుకు చేరింది. 13 మంది పోలీసులు గాయపడ్డారు. కాగా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న వారిని, సిబ్బందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఈ ఆపరేషన్‌లో ఎస్‌ఎస్‌జీ కమాండోలు, అల్-బుర్క్ ఫోర్స్, ఎలైట్ ఫోర్స్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పాకిస్తాన్‌లో కాల్పులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES