– నాన్ పార్కింగ్ ప్లేస్ లో ఆటోలు
– ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో రోజురోజుకు ట్రాఫిక్ పెరిగిపోతుంది. కామారెడ్డి జిల్లా కేంద్రం కావడం, ప్రధానంగా వాణిజ్య వ్యాపార కేంద్రంగా ఉండడంతో ఇక్కడికి కామారెడ్డి జిల్లాతో పాటు ఇతర జిల్లా వాసుల సైతం వస్తూ వ్యాపారాలు చేసుకుని పోతూ ఉంటారు. అలాంటి జిల్లా కేంద్రంలో ప్రధాన కూడలి అయిన నిజాంసాగర్ చౌరస్తా వద్ద షాపింగ్ మాల్ ఉండడంతో వాటికి పార్కింగ్ ప్లేస్ లేకపోవడం వల్ల రోడ్డుపైనే పలు వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు ఇబ్బంది కలుగుతుందనీ పలువురు ప్రయాణికులు పేర్కొంటున్నారు. ప్రధానంగా కిసాన్ షాపింగ్ మాల్ నిజాంసాగర్ మూలమలుపు వద్ద ఉండడంతో ఆ షాప్ ముందు పండగల సమయంలో రద్దీగా ఉండే రోడ్లు పై ఆటోలు నిలవడంతో ప్రయాణికులు వెళ్లడానికి ఇబ్బంది కలుగుతుంది.
ప్రధాన కూడలి వద్ద ఉండవలసిన ట్రాఫిక్ పోలీసులు అక్కడ లేకపోవడంతో ఆటోలు వాహనాలు కిసాన్ షాపింగ్ మాల్ ముందు నిలబడడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు నిజాంసాగర్ చేరస్తా వద్ద ఉండి ట్రాఫిక్ ను నియంత్రణ చేయాలని పట్టణ ప్రజలతోపాటు పట్టణానికి వచ్చిపోయే ప్రజలు ట్రాఫిక్ పోలీసులను కోరుతున్నారు.
ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదు..
పోలీసులు ట్రాఫిక్ తగ్గేందుకు నిజం సాగర్ వెళ్లే మూలమలుపు వద్ద భారీ కళ్ళు తొలగించిన కిసాన్ షాపింగ్ మాల్ కు పార్కింగ్ ప్లేస్ లేకపోవడంతో ఈ షాపింగ్ మాల్ ముందు ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుంది. ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకునేందుకు మరోచోట ఆటోలు ఆగడానికి కిసాన్ షాపింగ్ మాల్ యజమానులు స్థలాన్ని చూపిస్తే అక్కడ ఆటోలు ఆగితే ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం ఉండదు. ఈ దిశగా మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నం చేయాలని జిల్లా ప్రజల కోరుతున్నారు.