డిఈఈ రెండు మండలాలకు ఇంచార్జి బాధ్యతలు..
నవతెలంగాణ – ముధోల్
ముధోల్ నియోజకవర్గంలో ఆర్ డబ్ల్యూ ఎస్ ఇంట్రాలో ఏఈఈ పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో డిఈఈ రెండు మండలాలకు ఇంచార్జి ఏఈఈ గా విధులు నిర్వహిస్తున్నారు. భైంసా ఆర్ డబ్ల్యూ ఎస్ ఇంట్రా సబ్ డివిజన్ లో భైంసా, కుబీర్,ముధోల్, బాసర, తానుర్ లోకేశ్వరం మండలాలు ఉన్నాయి. అయితె కుబీర్ మండలానికి ఎఈఈ గా రాజన్న,తానుర్ కు పృథ్వీధర్,లుపనిచేస్తున్నారు. ఇటీవల ముధోల్ మండలానికి ఎఈఈ గా హరిచందన,లోకేశ్వరం కు సాయిప్రసాద్ లు కొత్తగా నియమింతులు అయ్యారు. భైంసా సబ్ డివిజన్ లో ఆరు మండలాల్లో రెండు ఏఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తానుర్ ఏఈఈ బాసరమండలం కు ఇంచార్జి గా వ్యవహరిస్తున్నారు.
బైంసా డిఈఈ అరుణ్ కుమార్ బైంసా మండలానికి ఇంచార్జి ఏఈఈ తో పాటు కుబీర్ ఏఈఈ అనారోగ్యం సమస్యలు ఎదుర్కోవడంతో అ మండలం కూడా అధనపు భాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీషన్ భగీరథ పధకం ప్రారంభం అయిన నుంచి ఆర్ డబ్ల్యూ ఎస్ ఇంట్రా బాధ్యతలు మరింత పెరిగాయి. మీషన్ భగిరధ గ్రీడ్ వారు గ్రామాల్లో ఉన్న మంచినీటి ట్యాంకు లకు నీటినీ నింపె వరకు బాధ్యత. గ్రామంలో మంచినీటి సరఫరా భాధ్యత స్థానిక గ్రామపంచాయతీ వారు నిర్వహింస్తున్నారు. ఇంట్రా వారే పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ఏఈఈల పోస్టులు ఖాళీగా ఉండటంతో అదనపు పని భారంతో డిఈఈ , ఏఈఈలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రాగు నీటి పధకం ల పనితీరు వివరాల ను ఆన్లైన్లో పొందుపరిచాలి.
అలాగే కేంద్ర ప్రభుత్వం పధకం అయిన జల్ జీవన్ మిషన్ లో త్రాగు నీటి పధకంకు సంబంధించిన పూర్తి సమాచారం ను యాప్ లో పొందుపరచాలి. దీంతో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న డిఈఈ,ఏఈఈలు కూడా ఇన్చార్జి మండలాల్లో కూడా వీరే ఆన్లైన్ లో పొందుపరస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంచినీటి కోసం వెచ్చించే నిధుల తో చెపట్టె అభివృద్ధి పనులు ఇంట్రా ఆధ్వర్యంలో నిర్వహింస్తున్నారు. దీంతో సంబంధిత అధికారులకు అదనపు పని భారం తప్పడం లేదు. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి. అయితే ఖాళీ పోస్టులతో రెండు మండలాల్లో ఇంచార్జి లతో నెట్టుకొస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో త్రాగు నీటి సమస్య పలుమార్లు ఉత్పనమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి ఖాళీగా ఉన్న ఏఈఈల పోస్టులను భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు.
ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖలో ఏఈఈ ల కొరత..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES