ఐద్వా జిల్లా కార్యదర్శి ఎ.నర్మద
నవతెలంగాణ – గట్టు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకుల కొరత తీర్చాలిగెస్ట్ ఫ్యాకల్టీ గా రెండు సంవత్సరాలు పనిచేసిన లెక్చరర్ల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రజావాణి సందర్బంగా ఐద్వా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఐద్వా జిల్లా కార్యదర్శి నర్మద మాట్లాడుతూ.. గతంలో కలెక్టర్ ఆదేశాల మేరకు గెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా ఐదు మంది లెక్చరర్ లను నియమించి, 2019 సంవత్సరం నుండి 2023 వరకు రెగ్యులర్ గా కలెక్టర్ నిధులనుంచి జీతాలు అందించారు. 2023 -24, 2024- 25 రెండు సంవత్సరాలు గెస్ట్ ఫ్యాకల్టీ గా తీసుకొన ఐదు మంది లెక్చరర్లకు జీతాలు చెల్లించలేదు. 2025 – 26 ఈ విద్యా సంవత్సరంలో ఎంపీసీ 26 బైపిసి 68 ఎం ఎల్ టి 68, – ఎం పి హెచ్ డబ్ల్యు 60 విద్యార్థులు మొదటి రెండవ విద్యను కొనసాగిస్తున్నారు.
ఈ సంవత్సరం విద్య బోధించడానికి ప్రభుత్వం నియమించిన విధంగా నే విద్యను బోదిస్తున్నారు. ఇతర కాలేజీల నుండి ఐదు రోజులు ఒక్కొక సబ్జెక్ట్ కు ఒక రోజు బోదించడం వాళ్ళ విద్యార్థుల కు సబ్జెక్ట్ పరంగా అర్థం కానీ పరిస్థితి లో వున్నారు. మారు ముల్ల గ్రామాల నుండి రవాణా సౌకర్యం లేకున్నా ప్రవేట్ ఆటోలో రోజు కళాశాలకు హాజరువుతున్న ఒక రోజు ఒక సబ్జెక్ట్ బోదిస్తే విద్యార్థుల కు సెలబస్ ఎప్పుడు పూర్తి అవుతాయి ఎగ్జామ్స్ ఎ విధంగా రాయాలి అనే విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. గట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాల లో నెలకొన్న అధ్యాపకుల కొరత తీర్చాలని గెస్ట్ ఫ్యాకల్టీ కింద రెండు సంవత్సరాలుగా పని చేసిన లెక్చరర్ల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఐద్వా నాయకురాలు రాణి, సుజాత పాల్గొన్నారు.
గట్టు జూనియర్ కళాశాలలో అధ్యాపకుల కొరత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES