సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నూర్జహాన్
నవతెలంగాణ-వర్ని(రుద్రూర్)
భారీ వర్షాలకు పంట నీట మునిగి రాష్ట్రంలోని రైతాంగం పూర్తిగా నష్టపోయిందనీ, ఈ విపత్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నూర్జహాన్ డిమాండ్ చేశారు. శనివారం నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను పార్టీ నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా నూర్జహాన్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట పొలాలతో పాటు ఇండ్లు ధ్వంసమై నిరాశ్రయులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. గుంతలు ఏర్పడిన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. నష్టపోయిన నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు శంకర్‌గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు విగేష్, ఏరియా కార్యదర్శి నన్నేసాబ్, మండల కన్వీనర్ నెల్లూరి లక్ష్మణ్, నాయకులు పాల్గొన్నారు.
జాతీయ విపత్తుగా ప్రకటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES