జిల్లా ఎస్సీ,ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు సునీల్
నవతెలంగాణ – నసురుల్లాబాద్
విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు, నైపుణ్యాభివృద్ధి మరియు మెరుగైన ఉపాధి అవకాశాల కోసం ఉన్నత విద్య, అభ్యసించడం, పరిశోధనలపై ఆసక్తి చూపడం ఎంతో ముఖ్యం అని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు సునీల్ రాథోడ్ తెలిపారు. శనివారం నసురుల్లాబాద్ మండలంలోని సంగం ,అంకోల్ తండా, హాజీపూర్, అంకోల్ గ్రామాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న నాలుగో తరగతి , ఐదవ తరగతి విద్యార్థులకు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ తరపున స్టడీ మెటీరియల్ లను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యుడు సునీల్ రాథోడ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యావైపు రాణించాలన్నారు. గ్రామీణ పేద కుటుంబాల విద్యార్థులు ఉన్నత విద్యా వైపు వెళ్లేందుకు తమ వంతుగా ప్రతి పాఠశాలకు నాలుగు స్టడీ మెటీరియల్ పుస్తకాలను అందించి గురుకులల్లో సీటు సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు గ్రామానికి మంచి పేరును తీసుకురావాలని ఆశించారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలన్నారు.
నేటి రోజుల్లో ఎవ్వరు దోచుకొని అస్థి విద్య ఒక్కటే అన్నారు. చదువులు చదివి జీవితంలో ఉన్నతం స్థాయికి ఎదగాలంటే అది చదువుతోనే సాధ్యమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ బాగా చదివి గురుకులంలో సీటు సంపాదించాలని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ఉపాధ్యాయులు సంగం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ చంద్ దొండొబా, పరవయ్య పాల్గొన్నారు.



