– హద్దుమీరి తే శాఖ పరంగా చర్యలు
– గ్రామీణ వైద్యులకు హెచ్చరిక
– డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ తుకారాం
నవతెలంగాణ – అశ్వారావుపేట
పల్లెలు, మారుమూల ప్రాంతాల్లో స్థానిక గ్రామీణ వైద్యుల వద్దకు ఎవరైనా అస్వస్థతకు గురైన రోగులు తీవ్రమైన అనారోగ్యంతో వస్తే వారికి ప్రాథమిక చికిత్స మాత్రమే చేసి, తక్షణమే అందుబాటులో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ తుకారాం ఆర్ఎంపీ లను ఆదేశించారు. సోమవారం మండలం లోని వినాయకపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెపటైటిస్.బి వ్యాక్సిన్ ప్రోగ్రాం ను లాంచనంగా ప్రారంభించినారు.
అనంతరం ఆర్ఎంపీ,పీఎంపీ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే ఆర్ఎంపీ లు మీ మీ పరిధి దాటి వైద్యం చేయరాదని హెచ్చరిక జారీ చేసారు.ఆర్ఎంపీ లు ఎవరైనా అధిక మోతాదులలో యాంటీ బయోటిక్స్ ఇంజక్షన్లు వాడి రోగులకు రియాక్షన్స్ వచ్చే లా వ్యవహరించ కూడదని సూచించారు.ప్రజలకు ఇబ్బందులు కలిగితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఆర్ఎంపీ లు ఎవరైనా గ్రామీణ ప్రాంతాలలో అబార్షన్లు చేసినట్లయితే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ,అలాగే గర్భిణీ తో ఉన్న వారికి వారికి పుట్టబోయే పిల్లల లింగ నిర్ధారణ (అబ్బాయా అమ్మాయా) స్కానింగ్ ద్వారా నిర్ధారించి చెప్పే వారి పై కూడా పీసీసీ & పీడీ యాక్ట్ ప్రకారం చర్య తీసుకుంటామని అని హెచ్చరించారు.
ఆర్ఎంపీ లు ప్రభుత్వ వైద్య సిబ్బందికి సహకరించాలని కోరారు.చైల్డ్ మ్యారేజ్ పై, నేషనల్ డీ వామింగ్ డే పై, లెప్రసీ వ్యాధిపై అవగాహన కల్పించారు. ప్రతి రెండు నెలలకు వైద్యాధికారి నిర్వహించే సమావేశాలకు తప్పనిసరిగా అందరూ హాజరుకావాలని, వైద్యాధికారి సూచనలు సలహాలు పాటించాలని అన్నారు. ఈ సమావేశానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రామదాసు,డీ పీఎంఓ మోహన్, సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వరరావు,సిబ్బంది పాల్గొన్నారు.


