Sunday, July 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమత్స్య సొసైటీలకు నగదు బదిలీ చేయాలి

మత్స్య సొసైటీలకు నగదు బదిలీ చేయాలి

- Advertisement -

– సీఎం రేవంత్‌రెడ్డికి ఉత్తరాలు పోస్టు చేసిన సొసైటీలు
– చేపల పంపిణీపై వెంటనే స్పందించాలి : మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ
నవతెలంగాణ-పాలకుర్తి

రాష్ట్రంలో మత్స్య సొసైటీ జల వనరులకు ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీకి బదులుగా.. నగదు బదిలీ పథకం ద్వారా సొసైటీల ఖాతాల్లో జమ చేయాలని మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గల శుభం గార్డెన్‌ (కరుణ మూర్తి ప్రాంగణం)లో నీరటి చంద్రయ్య, పిట్టల స్వరూప, చొప్పరి బిక్షపతి అధ్యక్షతన శనివారం మత్స్య కారులు, మత్స్య కార్మిక సంఘం జిల్లా మూడో మహాసభ జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 6550 మత్స్య కార్మికుల సొసైటీల్లో 6 లక్షల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. గత పాలకులు అమలు చేసిన మత్స్య సొసైటీలకు ఉచిత చేప పిల్లలు, రొయ్యల పంపిణీ కార్యక్రమం దళారీలకు కల్పతరువుగా మారిందన్నారు. కుంటలు, చెరువులు, రిజర్వాయర్లలో ఉచితంగా చేప పిల్లలు పోయాల్సి ఉండగా సీజన్‌ దాటినా ప్రారంభించనందున మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోతారని అన్నారు. నగదు బదిలీ కోసం 500 మంది సొసైటీ సభ్యులు సీఎం రేవంత్‌ రెడ్డికి ఉత్తరాలు రాసినట్టు తెలిపారు. సొసైటీలకు నగదు జమ చేయడంతో సీజన్‌ ప్రకారం చేప పిల్లల పెంపకం జరుగుతుందని, మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేటికీ చేప పిల్లల పంపిణీ విషయంలో నిర్దిష్టమైన ప్రకటన చేయక పోవడంతో మత్స్య కారులు ఆందో ళన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందిం చి ఎలాంటి టెండర్లూ లేకుండా మత్స్య సొసైటీ ఖాతాలో నగదు జమ చేయాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -