Friday, January 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉన్నతమైన ఆలోచనలతో నుమాయిష్‌

ఉన్నతమైన ఆలోచనలతో నుమాయిష్‌

- Advertisement -

హైదరాబాద్‌ను ఫ్రీ పొల్యూషన్‌ సిటీగా మారుస్తాం : 85వ ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

నవతెలంగాణ- సుల్తాన్‌ బజార్‌
ఉన్నతమైన ఆలోచనలతో ఎగ్జిబిషన్‌ (నుమాయిష్‌) మొదలైందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గురువారం హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో 85వ ఆల్‌ ఇండియా ఇండిస్టియల్‌ ఎగ్జిబిషన్‌ను మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, రాజ్యసభ మాజీ సభ్యులు వి.హనుమంతరావు, ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ మెట్టు సాయికుమార్‌, ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షులు ఆర్‌.సుఖేష్‌ రెడ్డి, గౌరవ కార్యదర్శి రాజేశ్వర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వందేమాతరం గీతాలాపన చేసి, రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. ఉన్నతమైన ఆలోచనలతో వివిధ రాష్ట్రాలకు చెందిన చిన్న, మధ్య తరగతి వివిధ రకాల ఉత్పత్తుల ప్రదర్శన ద్వారా నుమా యిష్‌ మొదలైందని చెప్పారు.

ఎగ్జిబిషన్‌ అంటే ఇండిస్ట్రి యల్‌కి సంబంధించింది మాత్రమేకాదని, వివిధ రాష్ట్రాలకు చెందిన విభిన్న సంస్కృతులు, ఉత్పత్తుల కళానైపుణ్యం ప్రద ర్శించడానికి ఒక సెంటర్‌ అని చెప్పారు. 1938లో ప్రారంభమైన నుమాయిష్‌ 1949లో ఆల్‌ ఇండియా ఇండ స్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌గా ప్రత్యేక ప్రాముఖ్యత లభించిందని, మొదటి గవర్నర్‌ జనరల్‌ సి.రాజగోపాలచారి హయాంలో నుమాయిష్‌ ఏర్పడిందని వివరించారు. ఈ ఎగ్జిబిషన్‌ ద్వారా వచ్చిన ఆదాయంతో విద్యాసంస్థలకు ఖర్చు పెడు తున్న ఎగ్జిబిషన్‌ సొసైటీని అభినందించారు. ఈ నుమా యిష్‌ పేరును ప్రపంచస్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తామ న్నారు. హైదరాబాద్‌ అన్ని మతాలు, వృత్తుల వారికి అనుకూలంగా ఉందని, మూసీనదిని మరో మణిహారంగా మార్చేందుకు పరివాహక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

రాష్ట్రం గ్లోబల్‌ సిటీగా మారబోతోందని, అందులో హైదరాబాద్‌ను పొల్యూషన్‌ ఫ్రీ సిటీగా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పొల్యూషన్‌ కంట్రోల్‌ చేసేందుకు ఎలక్ట్రిక్‌ బస్సులను ఏర్పాటు చేసిందన్నారు. ఇండిస్టియల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ వచ్చేందుకు హైదరాబాద్‌ను కాలుష్య రహిత ప్రాంతంగా మార్చి ప్రత్యేక ఇండిస్టియల్‌, కంపెనీలు పెట్టేందుకు కృషి చేస్తామన్నారు. ప్యూర్‌ వాటర్‌, కరెంట్‌తోపాటు పొల్యూషన్‌ ఫ్రీ సిటీ చేసేందుకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజులపాటు ఈ ఎగ్జిబిషన్‌ కొనసాగుతుందని చెప్పారు. సుమారు 85 ఏండ్ల చరిత్ర ఉన్న నుమాయిష్‌ కేవలం షాపింగ్‌ వేదిక మాత్రమే కాదని, ఇదొక సాంస్కృతిక వైభవమన్నారు.

ఈ ఏడాది 1050 స్టాళ్లు ఏర్పాటు చేశామన్నారు. సందర్శనకు వచ్చే వారికోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని, పారిశ్రామిక ప్రదర్శనగానే కాకుండా దేశం నలుమూలల నుంచి రకరకాల సంప్రదాయాలకు చెందిన కళాకృతుల స్టాల్స్‌ ఉంటాయని అన్నారు. మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి వారి ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారని అన్నారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో 19 కాలేజీల ద్వారా విద్యార్థులకు విద్యను అందిస్తున్నారని, నాలుగు వేల మంది టీచింగ్‌ నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారని వివరించారు. చుప్‌ చుప్‌ రైలును మంత్రులు ప్రారంభించారు. జైల్‌ స్టాల్‌ను మంత్రులతో కలిసి పోలీసు అధికారులు ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ సంయుక్త కార్యదర్శి టి.చంద్ర శేఖర్‌, పబ్లిసిటీ సెక్రెటరీ సురేష్‌కుమార్‌, ఎన్‌.సంజీవ్‌ కుమార్‌, కోశాధికారి సంజయ్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -