Thursday, April 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామస్థాయి క్రీడల్లో సత్తా చాటాలి 

గ్రామస్థాయి క్రీడల్లో సత్తా చాటాలి 

- Advertisement -

రాష్ట్ర నాయకులు బాలరాజ్ 
నవతెలంగాణ – మిడ్జిల్

గ్రామస్థాయిలో ఉన్న క్రీడాకారులలోని నైపుణ్యతను వెలికితీయడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్రామస్థాయి నుండి క్రీడలను ప్రారంభం చేశారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలరాజ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోనీ క్రీడా మైదానంలో ప్రధానమంత్రి ఖేల్ సంసద్ మహోత్సవ్ లో భాగంగా క్రీడా పోటీలు  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలరాజు. బీజేపీ మండల అధ్యక్షుడు నరేష్ నాయక్ తో కలిసి క్రీడలను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యువకులలో చైతన్యం తీసుకురావడానికి మండల స్థాయిలో క్రీడా పోటీలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది అని తెలిపారు. క్రీడలు శారీరిక దృఢత్వంతో పాటు, స్నేహభావాలు పెరుగుతాయని పేర్కొన్నారు. మండల స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో రాష్ట్రస్థాయిలో, ఎంపిక చేయబడతారని తెలిపారు.

మండల క్రీడాకారులు దేశ స్థాయికి ఎంపికై గ్రామానికి మండలానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని యువకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ గీతాంజలి, ఎంపీ ఓ రాజశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శివా రెడ్డి, జిల్లా నాయకులు రాజేశ్వర్, పల్లె తిరుపతి, వాడియాల నరేష్, నరేందర్, వాసుదేవ్, శేఖర్, పీడీ లు రాజశేఖర్, శంకర్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -