Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రమదానం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రమదానం

- Advertisement -

నవతెలంగాణ- కట్టంగూర్
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ ముక్కాముల శ్యామలశేఖర్ తో పాటు పాలకవర్గం సభ్యులు శ్రమదానం చేపట్టారు. ఈ  సందర్భంగా పాఠశాల పరిసరాలను శుభ్రపరచారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి అంబటి అంజయ్య, ఉపసర్పంచ్ గుండు రాంబాబు, వార్డుసభ్యులు, ఏనుగు సైదులు యర్కల శశి, అయితగోని సైదమ్మ, ఐతగొని సైదులు, కళ్ళెం నాగేశ్వర్ రావు, మైనం ఉమఅంబేద్కర్ పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -