నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హాస కొత్తూర్ లో సోమవారం సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి ఆధ్వర్యంలో శ్రమదానాన్ని నిర్వహించారు. హాసకోత్తూర్ గ్రామం నుండి కమ్మర్ పల్లికి వెళ్లే దారిలో మారుతి నగర్ మూల మలుపు వద్ద ఆర్ అండ్ బి బీటీ రోడ్డు ప్రక్కన ప్రయాణికులకు ఇబ్బందిగా ఉన్న పిచ్చి మొక్కలను శ్రమదానం చేసి తొలగించారు. మూలమలుపు వద్ద ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలతో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక అనేకసార్లు రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్ నలిమేల రేవతి గంగారెడ్డి చొరవతో మూలమలుపు వద్ద పిచ్చి మొక్కలను తొలగించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమములో గ్రామ ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్, వార్డ్ సభ్యులు కుందేటి శ్రీనివాస్, రాధారపు గంగాధర్, కనక నర్సయ్య, జుంబరత్ అశోక్, గ్రామస్తులు నలిమెల గంగారెడ్డి, మండపల్లి మహేందర్, నాయిని పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.
హాస కొత్తూర్ లో శ్రమదానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



