ఆసీస్‌తో సిరీస్‌కు భారత్-ఏ కెప్టెన్సీ
నితీశ్ కుమార్, మహ్మద్ సిరాజ్‌కు చోటు
నవతెలంగాణ-ముంబయి : 2025 ఆసియా కప్‌కు శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయలేదని భారత క్రికెట్లో తీవ్ర దుమారం రేగగా.. వన్డే కెప్టెన్సీకి అతడి పేరు పరిశీలిస్తున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా స్వదేశంలో ఆస్ట్రేలియా-ఏతో జరిగే రెడ్‌బాల్ ఫార్మాట్ సిరీస్‌లో తలపడే భారత-ఏ జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం భారత-ఏ జట్టును ఎంపిక చేసింది. ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడిన నితీశ్ కుమార్ రెడ్డి సహా మహ్మద్ సిరాజ్ సైతం భారత్-ఏ తరఫున ఆడనున్నారు. భారత్-ఏ, ఆసీస్-ఏలు రెండు మల్టీడే మ్యాచులు ఆడనున్నాయి. సెప్టెంబర్ 16న తొలి, 23న రెండో మ్యాచ్ ఆరంభం అవుతాయి. రెడ్‌బాల్ మ్యాచులు లక్నోలో జరుగుతాయి. ఆ తర్వాత కాన్పూర్‌లో మూడు వన్డేలు ఆడతారు. వన్డే జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. మహ్మద్ సిరాజ్, కెఎల్ రాహుల్‌లు తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండగా.. రెండో మ్యాచ్‌లో ఆడతారు.
భారత-ఏ జట్టు :
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబె, ఆయుశ్ బదాని, నితీశ్ కుమార్ రెడ్డి, తనుశ్ కొటియన్, ప్రసిద్ కృష్ణ, గుర్నీర్ బరార్, ఖలీల్ అహ్మద్, మానవ్ సుథర్, యశ్ ఠాకూర్, కెఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్.