– టారిఫ్‌లతో యుఎస్‌కు సరఫరాలో అమాంతం క్షీణత
– ఎగుమతిదారుల్లో ఆందోళన
న్యూఢిల్లీ : అమెరికా విధించిన అధిక టారిఫ్‌లు రొయ్య రైతు, ఎగుమతిదారులను బెంబేలెత్తిస్తు న్నాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది సెప్టెంబర్ లో అమెరికాకు రొయ్యల ఎగుమతులు ఏకంగా 75 శాతం పతనమయ్యాయని ఎగుమతిదారులు అంచ నా వేస్తున్నారు.సెప్టెంబర్ ఎగుమతుల డేటాను ఇంకా అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
మొత్తం భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతు ల్లో అమెరికా 35 శాతం వాటా కలిగి ఉంది. ”ఆగస్టు 27 నుంచి యూఎస్ భారత రొయ్యల రవాణాపై సుమారు 60 శాతం సుంకాలు విధించిన తర్వాత.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధభాగంలో రొయ్యల ఎగుమతులు తగ్గుతున్నాయని అంచనా.” అని జిటిఆర్‌ఐ సహ వ్యవస్థాపకుడు అజరు శ్రీవాస్తవ అన్నారు.
యూఎస్ ఆగస్టు 7న భారతీయ వస్తువులపై 25 శాతం టారిఫ్‌లను ప్రకటించింది. ఆ తర్వాత రష్యా చమురు దిగుమతులను సాకుగా చూపి అదనంగా 25 శాతం సుంకాలను వేసింది. ఈ టారిఫ్‌లకు ముందు భారత్ ఎగుమతులపై కేవలం 10 శాతం యాంటీ డంపింగ్ , కౌంటర్ వైలింగ్ సుంకాలు మాత్రమే ఉండేవి.
2024-25లో రూ.62,408 కోట్ల (7.45 బిలియన్ డాలర్లు) విలువ చేసే సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు జరిగేవి. ఇందులో 35 శాతం వాటా (2.8 బిలియన్లు) అమెరికాకే సరఫరా అయ్యేవి. గతేడాదితో పోల్చితే 2025-26 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 17 శాతం పెరిగి 3.97 బిలియన్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ రొయ్యల ఎగుమతి పరి మాణం 15-18 శాతం మేర తగ్గుతుందని రేటింగ్ సంస్థ క్రిసిల్ రేటింగ్స్ ఇటీవల పేర్కొంది. భారతీయ సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులు నష్టాలను భర్తీ చేయడానికి ఆస్ట్రేలియా, యూరోపియన్ యూని యన్, ఆగేయ మధ్యప్రాచ్య ప్రాంతాలు వంటి ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషిస్తున్నారని ఒక అధికారి తెలిపారు.
రొయ్యల ఎగుమతులు 75 శాతం పతనం
- Advertisement -
- Advertisement -



