పైలట్ ప్రాజెక్టుగా గుజరాత్‌లో అమలు
నాయకులు, కార్యకర్తల అభిప్రాయాల మేరకే డీసీసీల ఎంపిక : ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
గుజరాత్ వేదికగా ప్రారంభమైన కాంగ్రెస్ సంఘటన్ శ్రియన్ అభియాన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా తమ పార్టీ బలోపేతానికి దోహదం చేస్తుందని ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో, పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అది ప్రారంభమైందన్నారు. హనుమకొండ జిల్లాలోని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ జిల్లా డీసీసీల ఎంపిక ప్రక్రియ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాల మేరకు జరగనుందని తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ‘శ్రియన్ అభియాన్’ కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలు కానుందని వెల్లడించారు.
మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ ప్రారంభించిన సంఘటన్ శ్రియన్ అభియాన్ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేయడమే లక్ష్యంగా తీసుకొచ్చిన గొప్ప ప్రయత్నం అని చెప్పారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, వారి అభిప్రాయాల ప్రకారం డీసీసీ నిర్మాణం జరగడం వల్ల పార్టీ ప్రజాస్వామ్య బలం పెంచుతుందని తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతి నాయకుడూ క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అబ్జర్వర్లు దుర్గం భాస్కర్, మసూద్, రేణుక, కోఆర్డినేటర్ ఆదర్శ్ జైస్వాల్, బస్వరాజు సారయ్య, వరంగల్ ఎంపీ కడియం కావ్య, కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, సీనియర్ నాయకులు వీసం సురేందర్ రెడ్డి, వీరమల్ల రంజిత్ రెడ్డి, పింగిలి నరసింహారెడ్డి, రహీమున్నీసా బేగం, బొల్లపోగు రమేష్ బాబు, ఇనుగల శ్రీనివాస్, శనిగరం వెంకటేష్, కట్ట రఘపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ బలోపేతానికి ‘శ్రియన్ అభియాన్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES