సర్పంచుల ఐక్యతతో గ్రామాభివృద్ధి
నవతెలంగాణ – నసురుల్లాబాద్
నసురుల్లాబాద్ మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షులు కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా నిర్వహించారు. గురువారం మైలారం శివారులోని కొచ్చేరి మైసమ్మ ఆలయం అతిథి భవనంలో ఏర్పాటు చేసిన నసురుల్లాబాద్ మండలం పరిధి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఫోరం సర్వేసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు అంకోల్ క్యాంప్ ఉప సర్పంచ్ రాము మాజీ కోఆప్షన్ నెంబర్ మజీద్ ల ఆధ్వర్యంలో మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ఎన్నిక నిర్వహించారు.
ఇందులో భాగంగా మండల ఫోరం అధ్యక్షులుగా లింగంపల్లి తాండ సర్పంచ్ కేతవత్ శ్యామ్ , మండల ఫోరం ఉప అధ్యక్షులుగా టి, సాయిలు, బొమ్మన్ దేవ్ పల్లి సర్పంచ్ , జనరల్ సెక్రటరీ గా రామ్ గోపాల్ రెడ్డి సర్పంచ్ నెమ్లి లను మిగతా సర్పంచులు ఏకగ్రీవంగా ఎందుకున్నారు. ఈ సందర్భంగా మండల ఫోరం అధ్యక్షుడు శ్యామ్ మాట్లాడుతూ సర్పంచులంతా ఐక్యతతో పని చేస్తే గ్రామాల అభివృద్ధి వేగంగా సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి గ్రామ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. సర్పంచుల హక్కులు, గ్రామాల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా గౌరవ సర్పంచ్ లు మాట్లాడుతూ..నసురుల్లాబాద్ మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కేతవత్ శ్యామ్ ఎన్నిక అభినందనీయమన్నారు.
సర్పంచులందరికీ అండగా నిలుస్తారనే పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిధి సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.



