- Advertisement -
నవతెలంగాణ – బొమ్మలరామారం
బొమ్మలరామారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా డి.శ్యామల సోమవారం బాధ్యతలను చేపట్టారు.గతంలో హైదరాబాద్ టీజీఐఆర్డి ఫారిన్ సర్వీస్ ముగించుకొని పంచాయతీరాజ్ శాఖకు తిరిగివచ్చారు.ఎంపీడీవోగా ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన రాజతివిక్రమ్ పదవి విరమణ పొందిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రభుత్వం ప్రజలకు అందేంచే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సత్వరమే అందేలా కృషి చేస్తానన్నారు.ఈ కార్యాలయ సిబ్బంది, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు దాసరి సూర్య ప్రకాష్ రెడ్డి, పుష్ప గుచ్చు అందజేసి సన్మానించారు. సర్పంచులులు ఎంపీడీవోను కలిసి అభినందనలు తెలిపారు.
- Advertisement -



