– ఉదయం ఎన్నికల విధులకు వెళ్లాలని స్టేషన్‌లోనే నిద్ర
నవతెలంగాణ -హయత్ నగర్
పోలీస్‌స్టేషన్‌లో ఉండగానే గుండెపోటుతో ఓ ఎస్‌ఐ ప్రాణం కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్ ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఇన్‌స్పెక్టర్ వినోద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని సతార్ జిల్లాకు చెందిన సంజరు సావంత్(58) భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నాచారంలో నివాసముంటున్నారు. రెండు సంవత్సరాలుగా ఎల్‌బీనగర్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో బుధవారం డ్యూటీ పడింది. మంగళవారం రాత్రి ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్‌లోనే పడుకుని తెల్లారాక విధులకు వెళ్దామనుకుని రెస్ట్ రూమ్‌లో నిద్రపోయాడు. ఉదయం ఎంతకీ లేవకపోవడంతో సిబ్బంది వెంటనే ఎస్‌ఐని కామినేని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన గుండెపోటుతో మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. 1989 బ్యాచ్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన సంజరు 2011లో హెడ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగోన్నతి పొందారు. 2020లో ఏఎస్‌ఐగా, 2023లో ఎస్‌ఐగా ప్రమోషన్ వచ్చింది. ప్రస్తుతం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
గుండెపోటుతో పోలీస్‌స్టేషన్‌లోనే ఎస్‌ఐ మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



