Sunday, May 4, 2025
Homeజిల్లాలుబుచ్చిబాబును అభినందించిన ఎస్ఐ హారిక..

బుచ్చిబాబును అభినందించిన ఎస్ఐ హారిక..

- Advertisement -


నవతెలంగాణ – శామీర్ పేట:  
శనివారం మండల కేంద్రం శామీర్ పేటలోని ఎస్బిఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి వెళ్లిన వల్లపు బుచ్చిబాబుకు తనకంటే ముందు ఎవరో  ఏటీఎంలో  డ్రా చేసిన  రూ.10వేల నగదు ఉండడంతో ఆ డబ్బులు తీసుకొని శామీర్ పేట పోలీస్ స్టేషన్ లో అందజేశారు. శామీర్ పేట పోలీసులు ఎస్బిఐ బ్యాంకుకు వచ్చి డ్రా అయిన డబ్బులు ఎవరివని విచారించారు. మండల పరిధిలోని గ్రామానికి చెందిన మహ్మద్ నజీర్ అని బ్యాంకు సిబ్బంది తెలిపారు. వెంటనే ఎస్ఐ హారిక బాధిత వ్యక్తికి డబ్బులు అందజేశారు. ఈ నేపథ్యంలో బుచ్చిబాబును శామీర్ పేట  పోలీసులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -