నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు మండలంలోని సింగారం గ్రామంలో సంక్రాంతి సందర్భంగా దాతల సహకారంతో ఆ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మూడు రోజులపాటు నిర్వహించే క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి మంగళవారం మునుగోడు ఎస్ఐ ఇరుగు రవి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని యువత క్రీడా పోటీలలో పాల్గొని తమ ప్రతిభను కనబడుచుకునేందుకు గొప్ప అవకాశం అని అన్నారు. క్రీడాకారుడికి మంచి గుర్తింపు వచ్చినప్పుడు గ్రామానికి , కన్న తల్లిదండ్రులకు గౌరవ పెరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ అబీబొద్దీన్ , గ్రామ పోలీస్ ఆఫీసర్ బి గౌతం, చండూరు మార్కెట్ కమిటీ డెరైక్టర్ కుంభం చెన్నారెడ్డి,గ్రామ ఉప సర్పంచ్ ఉప్పునూతల వేంకటేశ్వర్లు, కుంభం సురేందర్ రెడ్డి, వార్డు సభ్యులు పిట్టల శ్రావణ్ కుమార్, గుర్రాల సురేష్, కోడి అర్జున్ , కోడి చంద్రయ్య, టోర్నమెంట్ కోఆర్డినేటర్ సోమగాని నవీన్,నేరటి బాలు, సీనియర్ జర్నలిస్ట్ పోగుల ప్రకాష్ , కుంభం భూపాల్ రెడ్డి , సోమగాని రమేష్ , పిట్టల రఘు, గుంటుక వెంకటేష్, ఇండ్ల నాగరాజు, రావుల నరసింహ, పిట్టల వెంకట్, కోడి చంటి, రావుల మల్లేష్, ఆవనూరి శంకర్ ప్రసాద్, యువకులు తదితరులు పాల్గొన్నారు.



