- Advertisement -
నవతెలంగాణ -పెద్దవంగర
మండలంలోని గంట్లకుంట గ్రామంలో జరిగే ఏనే రామస్వామి జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆదివారం ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్, సర్పంచ్ ముత్తినేని యాకలక్ష్మీ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..జాతర ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది గ్రామంలో అంగరంగ వైభవంగా జాతర బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు.
- Advertisement -



