Monday, December 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా తప్పుదోవ పట్టిస్తున్న ఎస్ఐ

అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా తప్పుదోవ పట్టిస్తున్న ఎస్ఐ

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
ఫిర్యాదు చేసి 19 రోజులు గడుస్తున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నరని రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామానికి చెందిన బాధితులు తెలిపారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అత్యధిక గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ .. రామారెడ్డి  ఎస్.ఐ తాము కేసు పెడితే దాన్ని పట్టించుకోకుండా పక్కన పెట్టేసాడని ఆవేదన వ్యక్తం చేశారు. రామారెడ్డి మండలం ఉప్పల్వాయ్ గ్రామంలో దళిత సామాజిక వర్గాన్ని కుల దూషణ చేసిన ఆల ప్రవీణ్ రెడ్డి అనే పైన అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రామారెడ్డి పోలీస్ స్టేషన్లో డిసెంబర్ 10న ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈ కేసు నిలబడే అవకాశాలు లేవు.. మీరు మీకు తోచిన పని చేసుకోండి అంటూ.. కేసును తప్పుదోవ పట్టిస్తూ కేసును నిర్వీర్యం చేస్తున్నారనీ అన్నారు. ఎస్.సి (SC)  కులము వారిని దాబా హోటల్ కి తీసుకెళ్లి జేబులో అయిదు వేల రూపాయలు పెడితే చాలు నామినేషన్ కూడా డ్రాప్ అవుతారనీ, అంటూ కుల వివక్షకు గురి చేసి కుల దూషణ చేసిన ప్రవీణ్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ, ఆ వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలనీ అని బాధితులు కోరుతున్నారు.

ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ కేసును నిర్వీర్యం చేస్తున్న రామారెడ్డి ఎస్.ఐ కి ఇకనైన పైఆధికారులు ఆదేశాలు ఇచ్చి తక్షణమే కేసు నమోదు చేయడం కొరకు  చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. లేనిపక్షాన ఎస్సీ, ఎస్టీ  కమిషన్ ను ఆశ్రయిస్తామనీ, ప్రజా సంఘాలతో కలసి కార్యాచరణ ప్రకటించి న్యాయం కోసం పోరాటం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాము అని బాధితులు బత్తుల రవి, ఊట్ల యాదగిరి, జంగిటి సందీప్, బత్తుల ఉదయ్ కిరణ్, కొత్తోళ్ల సతీష్, కంకణాల దిలీప్,బత్తుల సతీష్ లు ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -