Friday, September 12, 2025
E-PAPER
Homeఆదిలాబాద్తాండా పోలాల పండుగలో పాల్గొన్న ఎస్ఐ..

తాండా పోలాల పండుగలో పాల్గొన్న ఎస్ఐ..

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ తాండాలో శుక్రవారం సాయంత్రం పొలాల అమావాస్య పండుగలో ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్ తో పాటు మహిళా పోలిసులు పలుపంచుకున్నారు. పోలిసు  బందోబస్తు లో బాగంగా గ్రామానికి వెళ్లారు.  దీంతో ఎస్ఐ, మహిళా పోలీసులకు గిరిజన సంప్రదాయ ప్రకారం  మహిళలు స్వాగతం పలికారు. తాండ వాసుల కోరిక మేరకు ఎస్ఐ, మహిళా పోలిసులు పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం అందరు కలిసి మెలిసి ఉంటు పండుగలనుజరుపుకోవాలన్నారు.ఏదైన సమాచారం తెలిసిన వెంటనే పోలిసులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ధూమా నాయక్, భైంసా మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామ్ నాధ్, తాండ పెద్దలు , రైతులు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -