నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని గ్రామ పంచాయితీ సమీపంలో 2007-08 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణపతి మండలం మండపం వద్ద మంగళవారం పెద్ద ఎత్తున అన్నవితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్వ విద్యార్థుల ఆహ్వానం మేరకు కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి, గణేష్ మండపం వద్ద అన్నపూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అన్న వితరణ సందర్భంగా మండపం వద్ద గణపతి పూజ, కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు గ్రామస్తులకు నిర్వహించిన అన్న వితరణ కార్యక్రమాన్ని ఎస్ఐ అనిల్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి, 2007-08 పదవ తరగతి బ్యాచ్ అధ్యక్షులు ఉట్నూర్ రాకేష్, ఉపాధ్యక్షులు మైలారం మధుకర్, కోశాధికారి పసుపుల వంశీ, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
గణేష్ మండపం వద్ద అన్నదానంలో పాల్గొన్న ఎస్ఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES