- Advertisement -
-కమ్యూనీటీ పోలీసింగ్ లో ఎస్ఐ సౌజన్య
నవతెలంగాణ – బెజ్జంకి
ప్రజల భద్రత మా బాధ్యతని.. సమాజంలో చోటుచేసుకుంటున్న నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగియుండాలని ఎస్ఐ సౌజన్య సూచించారు. బుధవారం మండల పరిధిలోని కల్లేపల్లి గ్రామంలో ఎస్ఐ సౌజన్య కమ్యూనీటీ పోలీసింగ్ నిర్వహించి అపహరణలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు వంటి వాటిపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శంకర్ రావు, సిబ్బంది ఓదయ్య, వీపీఓ కొడిశెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -