- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండల కేంద్రంలో టోల్ ప్లాజా వద్ద బుధవారం వాహనాలను తనిఖీ చేసిన ఎస్ఐ శంషుద్దీన్. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాదారుల డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ వంటి పత్రాలను తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు నంబర్ ప్లేట్లు లేకుండా రోడ్డుపై వాహనాలు నడిపిస్తే సీజ్ చేస్తామని తెలిపారు. అలాగే వాహనాలకు ఉన్న పెండింగ్ చలాన్లు చెల్లించాలన్నారు. తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ తిరుమల రావు, పిసీలు ప్రశాంత్, శేఖర్ ఉన్నారు.
- Advertisement -