నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే నినాదంతో సంకల్ప్ యాత్రను చేపడుతున్నట్లు టాటా ఏఐఏ కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్స్ కాశ బోయిన వీరస్వామి, కొండ ఆదర్శ్ కుమార్ లు అన్నారు. దీనిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం కరీంనగర్ టాటా ఏఐఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సంకల్ప యాత్రను సిరిసిల్ల టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ , ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ దిలీప్ లు ప్రారంభించారు. సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ నుండి గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, గోపాల్ నగర్ చౌరస్తా మీదుగా పాత బస్టాండ్ పెద్ద బజార్ లలో సంకల్ప్ యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రతన్ టాటా ఆశయాల మేరకు ఇండియాలో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలనే నినాదంతో ముందుకు వెళుతున్నామన్నారు. బిజీగా ఉండే జీవితంలో ఎప్పుడు ఏలాంటి సంఘటనలు జరుగుతాయో ఊహించలేని జీవితంలో బీమా చేసి కుటుంబానికి ధీమా కల్పించాలన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను ప్రతి కుటుంబానికి తెలిపేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ సంకల్ప్ యాత్రను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంకల్ప్ యాత్రలో టాటా ఏఐఏ ట్రైనింగ్ మేనేజర్ వెంకటేష్ వర్మ, అసిస్టెంట్ మేనేజర్స్ చంద్రశేఖర్, శ్రీకాంత్, ప్రవీణ్, పార్ట్నర్ గూడెల్లి రాజు, సిబిఏలు గైని శ్రీకాంత్, దూలం రమేష్, పనస వెంకట్, సీనియర్ బిజినెస్ అసోసియేట్ లీడర్స్ బుర్ర కవిత శ్రీనివాస్, నాగూర్ బి షేక్ ఆరిష్, రామకృష్ణ, రమేష్ లీడర్లు,ఎండిఆర్టి అడ్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.



