- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండల కేంద్రంలో ఎస్.ఐ గొల్లపెళ్లి అనూష ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా పాలువురికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం చాలా ప్రమాదకరమని, అలాంటి చర్యలు ప్రాణాంతక ఫలితాలకు దారి తీస్తాయని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడప రాదని అలా చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవణి హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా అన్ని రకాల ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



