నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడితో జాతీయ భద్రతపై భారత్ ప్రభుత్వం అప్రమత్తమైన విషయం తెలిసిందే. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ విస్త్రృతంగా సోదాలు నిర్వహిస్తుంది. తీవ్రవాద కార్యకలాపాల కట్టడి లక్ష్యంగా ఆయా ప్రాంతాల్లో పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రమూకల ఏజెంట్లను ఇప్పటికే అధికారులు అరెస్ట్ చేశారు. యూట్యూబర్ జ్యోతి మల్హాత్రతోపాటు దేశవ్యాప్తంగా ఏపీ, పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీల్లో పలువురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో స్టేట్ ఇన్విస్ట్ గేషన్ ఏజెన్సీ (SIA) దాడులు చేపట్టింది.ఉగ్రవాదులతో సత్సంబంధాలున్న ఓ వ్యక్తి ఇంట్లో సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించింది. ఈనెల 17కూడా ఏకకాలంలో జమ్మూలోని 11కీలక ప్రాంతాల్లో SIA దాడులను నిర్వహించి..పలువురిని అరెస్ట్ చేసింది. భారత్‌లో అక్రమంగా ఉంటూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థలకు సమాచారం చేరవేస్తున్నారని అధికారులు తెలిపారు.
జమ్మూలో SIA విస్త్రృతంగా సోదాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES