మా గొంతుకను అణచివేయడమే’ : కాశ్మీర్ టైమ్స్ సంపాదకులు
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ పోలీసుల ప్రత్యేక విభాగం జమ్ములోని ‘కాశ్మీర్ టైమ్స్’ వార్తాపత్రిక కార్యాలయంపై దాడులు చేపడుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్‌ఐఏ) బృందం గురువారం తెల్లవారుజామున పత్రిక కార్యాలయానికి చేరుకుని వివిధ విభాగాల్లో సోదాలు నిర్వహించింది. వార్తాపత్రికకు సంబంధించిన పత్రాలు , డిజిటల్ పరికరాల తనిఖీ చేయగా..అక్కడ ఏకే 47 తుపాకీ, కాట్రిర్జ్ లభించినట్టు అధికారులు తెలిపారు.
మా గొంతుకను అణచివేయడమే’
మా గొంతుకను అణచివేసేందుకే తమ కార్యాల యంపై ఎస్‌ఐఏ దాడులని కాశ్మీర్ టైమ్స్ సంపాదకులు ప్రబోధ్ జామ్వాల్, అనురాధ భాసిన్‌లు పేర్కొన్నారు. తమపై మోపబడిన ఆరోపణలు ”బెదిరించడానికి, చట్టబద్ధ హౌదాను తొలగించడానికి, చివరికి తమ గొంతుకలను అణచివేసేందుకు రూపొందించబడినవి” అని తెలిపారు. ”మేము మౌనంగా ఉండము. మా బాధ్యతలను కొనసాగి స్తున్నందున మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. విమర్శ నాత్మక గొంతుకలు అంతకంతకూ తగ్గిపోతున్న ఈ సమ యంలో .. అధికారంలో ఉన్న వారికి నిజం చెప్పడానికి సిద్ధంగా ఉన్న కొన్ని స్వతంత్ర సంస్థల్లో మేము ఒకరిగా ఉన్నాం ” అని జామ్వాల్, భాసిన్‌లు సంయుక్తంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం నుంచి జమ్మూలోని ‘కాశ్మీర్ టైమ్స్’ కార్యాలయంపై ఎస్‌ఐఎ సోదాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
ఆ సంస్థ సంపాదకులపై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్టు సమాచారం. ఈ సోదాలపై జమ్ముకాశ్మీర్ పోలీసులు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ” రాష్ట్రానికి విరుద్ధమైన కార్యకలా పాలు అనేవి నిరాధారమైన ఆరోపణలు. కాశ్మీర్ టైమ్స్‌పై సమన్వయంతో చేపట్టిన అణచివేత.. మమ్మల్ని నిశ్శబ్దం చేయడానికి మరో ప్రయ్నత్నం” అని సంపాదకులు పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడమంటే రాష్ట్ర విరుద్ధ కార్యకలాపాలు కాదని ఈ ప్రకటన పేర్కొంది. వాస్తవానికి, ఇది చాలా వ్యతిరేకమని, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ధృడమైన, ప్రశ్నించే పత్రికా యంత్రాంగం అవసరమని పేర్కొంది. అధికారాన్ని జవాబుదారీగా ఉంచడం, అవినీ తిని పరిశోధించడం, అణగారిన గొంతుకలను పెంచడం వంటి తమ పని దేశాన్ని బలోపేతం చేస్తాయని, అవి బలహీనపరచవని స్పష్టం చేశారు.
వేద్ భాసిన్ వ్యవస్థాపక సంపాదకుడిగా వ్యవహరించిన ‘కాశ్మీర్ టైమ్స్’ 1954 నుంచి స్వతంత్ర జర్నలిజానికి ఒక స్తంభంగా నిలిచిందని, ఈ ప్రాంత విజయాలను, వైఫల్యాలను సమానంగా అందించామని తెలిపారు. అణగారిన వర్గాలకు స్వరంగా మారామని, ఇతరులు మౌనంగా వున్నప్పుడు తాము కష్టమైన ప్రశ్నలను అడిగామని ప్రకటన పేర్కొంది. ఈ వేధింపులను వెంటనే ఆపాలని, నిరాధారమైన ఆరోపణలను వెనక్కు తీసుకోవాలని, రాజ్యాంగ హామీ అయిన పత్రికా స్వేచ్ఛను గౌరవించాలని అధికారులను కోరారు. ఈ సమయంలో మాకు మద్దతుగా నిలవాలని మీడియా లోని సహౌద్యోగులను కోరుకుంటున్నామని, పెరుగుతున్న నిరంకుశత్వ వాతావరణంలో జర్నలిజం మనుగడ సాధించగలదా లేదా అనే ప్రశ్నకు ఈ క్షణం ఒక పరీక్ష అని గుర్తించాలని సమాజాన్ని, పౌరులను కోరుతున్నామని ప్రకటనలో పేర్కొ న్నారు. ”జర్నలిజం నేరం కాదు. జవాబుదారీతనం దేశద్రో హం కాదు. మాపై ఆధారపడిన వారికి సమాచారం అం దించడం, దర్యాప్తు చేయడం, వారి తరపున వాదిం చడం మేము కొనసాగిస్తాము” అని ప్రకటన పేర్కొంది. రాష్ట్రానికి తమ కార్యాలయాలపై దాడి చేసే అధికారం ఉండవచ్చు కానీ అది సత్యం పట్ల తమ నిబద్ధతపై దాడి చేయలేదని పేర్కొన్నారు.



