కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ‘రాజీవ్ యువ వికాసం’ ఆశావహ నిరుద్యోగులకు అందుతుందా లేదా అన్న గందరగోళం నెలకొంది.యువతకు ఆర్థిక చేయూత అందించేందుకంటూ తెచ్చిన ఈ పథకం యువతను తిప్పలు పెడుతున్నది.బ్యాంకు సిబిల్ స్కోర్ దరఖాస్తుదారులను గుబులు పెడుతున్నది. ప్రభుత్వం కుటుంబంలో ఒక్కరికే అవకాశం కల్పించడమేగాక, రేషన్‌కార్డు ఉంటేనే పథకానికి అర్హత వంటి నింబంధనలు పెట్టింది. గత సర్కార్ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కోసం చేసుకున్న దరఖాస్తులు ఇప్పుడు మెడకు గుదిబండలా మారాయి. రాజీవ్ యువ వికాసం కింద దరఖాస్తులో ఆధార్ నంబర్‌ను నమోదు చేయగానే ‘ఆల్రెడీ అప్లైడ్’ అని చూపుతున్నది. ఇక వికలాంగుల సంగతి సరేసరి. ఈ ఆటంకాలన్నింటిని దాటుకొని యాభై లక్షల మంది నిరుద్యోగులకు గాను 16.23 లక్షల దరఖాస్తు వచ్చాయి. ఇప్పుడు వీరిని సిబిల్ నిబంధనలు పరేషాన్ చేస్తున్నాయి.
వాస్తవానికి నిరుద్యోగులు రూపాయి ఆదాయం లేకనే ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువవికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. దమ్మిడి ఆదాయం లేని యువకులకు బ్యాంకుల్లో అకౌంట్లు ఎక్కడివి? ఉన్నా అవి పైచదువుల కోసం సర్కార్ ఇచ్చే స్కాలర్ షిప్‌ల కోసం తెరిచినవే కానీ వాటిలో పెద్దగా లావా దేవీలు ఉండవు. ప్రభుత్వం ఇచ్చే కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు, చిరు వ్యాపారులకు ఇప్పుడు బ్యాంకర్ల సిబిల్ స్కోరు తనిఖీ పెద్ద ఆటంకంగా మారుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు సిబిల్ స్కోరు బావుంటేనే లోన్లు లభిస్తాయనడం ఎంత వరకు సబవు? ఈ నిబంధన యువతకు ప్రతిబంధకంగా మారుతున్నది.
ఎన్నో ఆశలతో సబ్సిడీ రుణాలు పొంది జీవితంలో సెటిల్ అవుదామనుకుంటున్న నిరుద్యోగుల ఆశలపై సిబిల్ స్కోరు నీళ్లు చల్లుతున్నది. బ్యాంకర్లు గుడ్, బ్యాడ్, ఎక్సలెంట్, యావరేజ్ అంటూ సిబిల్ స్కోరు నిర్ణయిస్తున్నారు. ఆధార్‌కార్డు నెంబర్, బ్యాంక్ అకౌంట్లు, ఫోన్ నెంబర్లు కేవైసీ చేసి వాటి ద్వారా నిరు ద్యోగుల, చిరు వ్యాపారుల సిబిల్ స్కోరు ర్యాంకులను నిర్ణయిస్తారు. క్రెడిట్ కార్డు వాడేవారికి, పెద్ద వ్యాపారులకు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు దీనిపై పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది. స్కోరు పడిపోకుండా వారు డబ్బులను రొటేషన్ చేస్తుంటారు. కొత్తగా బ్యాంక్ అకౌంట్ తెరిచిన వారికి మైనస్ ఒకటి ర్యాంకింగ్ ఇచ్చి చిన్నపాటి రుణం మాత్రం ఇస్తారు.
ఇకపోతే ఫోన్ యాప్‌ల్లో లోన్లు తీసుకున్నవారికి, క్రెడిట్‌కార్డు లోన్లు ఉన్నవారికిి సిబిల్ స్కోరు తక్కువ గానే ఉంటుంది. రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసిన వారికి ఆదాయం ఉండదు. ఆ ఆదాయ మార్గాలు, ఉపాధి మెరుగు పర్చుకునేందుకే ఈ లోన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈ పథకం కింద వివిధ కార్పొరేషన్ల ద్వారా రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు వ్యక్తిగత రాయితీ రుణాలిచ్చి వారికి అండగా నిలబడతామని ప్రభుత్వం చెప్పిన మాటలు నమ్మే నిరుద్యోగ యువత సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిని సిబిల్ పేరుతో వంచనకు గురి చేయడం ఈ ప్రభుత్వానికి తగునా?
నిరుద్యోగులకు వరంగా రూపొందించిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి అమల్లోకి రానుందని ప్రభుత్వం చెబుతున్నది. ఇదంతా బాగానే ఉన్నా యువ వికాసం రుణాలు రావాలంటే తప్పనిసరిగా బ్యాంకు సిబిల్ స్కోర్ 700 దాటితేనే రుణాలకు అర్హులని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని అధికారులు అంటు న్నారు. కానీ, ఇదంతా కేవలం సోషల్ మీడియా ప్రచారం మాత్రమే తప్ప వాస్తవం కాదని, లబ్ధిదారుల ఎంపికకు సిబిల్ స్కోర్‌కు సంబంధం లేదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటన చేసినప్పటికీ.. ఈ ప్రచా రం మాత్రం ఆగటం లేదు. ఇటు ప్రభుత్వ మాటలకు… అటు అధికారుల చేతలకు పొంతన లేక నిజమైన లబ్దిదారులకు న్యాయం జరుగుతుందా అన్న అనుమానాలు చెక్కర్లు కొడుతున్నాయి. దీంతో దరఖాస్తు దారులు అయోమయానికి గరువు తున్నారు. మరోవైపు లబ్ధిదారుల జాబితాల వెల్లడికి సమయం దగ్గర పడుతున్నది. జూన్ 2న మంజూరు పత్రాలను అందజేస్తారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన ఉంటుందా? దరఖాస్తు దారుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుం టుందా? అనేది ఉత్కంఠగా మారింది! కాబ ట్టి ఈ గందరగోళానికి తెరదించి యువతకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
సిబిల్ గుబులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES