నవతెలంగాణ – ఆర్మూర్
యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధమ మహాసభలు మూడు రోజులపాటు జిల్లాలో ఎస్ ఆర్ కె ఫంక్షన్ హాల్లో నిర్వహించటం జరిగిందని యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ నూతన కార్యదర్శి సిద్దాల నాగరాజు మంగళవారం తెలిపారు. ఈ మహాసభలలో నూతన రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక జరిగిందన్నారు. మొత్తం రాష్ట్ర కమిటీ 45 మందితో ఎన్నిక. ఇందులో 17 మంది రాష్ట్రఆఫీస్ బేయర్స్ గా ఎన్నిక అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ నా పైన ఉన్న నమ్మకంతో నన్ను యు ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రాష్ట్ర నాయకత్వ సమక్షంలో రాష్ట్ర కార్యదర్శి గా ఆర్మూర్ నుండి నియమించినందుకు రాష్ట్ర కమిటీకి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకు నాయొక్క అభినందన తెలియజేస్తున్నాను అని అన్నారు.
భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాల పట్ల పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తానని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలపై నిరంతరం యుఎస్ఎఫ్ఐ జెండా పోరాడుతుందని ఆయన తెలిపారు.



