సుప్రీంకోర్టు ఆదేశాలతో నాంపల్లి కోర్టులో హాజరు
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
తెలుగు నటి ప్రత్యూష మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో శిక్షార్హుడిగా తేలిన సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సోమవారం నాంపల్లి కోర్టు ఎదుట లొంగిపోయాడు. హైకోర్టు విధించిన రెండేండ్ల జైలు శిక్షను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇవ్వడంతో పాటు నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని అతన్ని ఆదేశించింది. ఇన్నాళ్లుగా అమెరికాలో నివసిస్తున్న సిద్ధార్థ్ రెడ్డి తీర్పు అనంతరం భారత్‌కు చేరుకుని నాంపల్లి కోర్టులో హాజరయ్యాడు. 2002 ఫిబ్రవరి 24న సిద్ధార్థ్ రెడ్డి, ప్రత్యూష కలిసి విషం కలిపిన శీతలపానీయం సేవించడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ప్రత్యూష మృతి చెందగా సిద్ధార్థ్ రెడ్డి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన ఆత్మహత్య కాదని, హత్యేనని ప్రత్యూష తల్లి దీర్ఘకాలంగా న్యాయపోరాటం కొనసాగించారు. ఈ కేసులో ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగాలపై ట్రయల్ కోర్టు సిద్ధార్థ్ రెడ్డికి ఐదేండ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం హైకోర్టు శిక్షను రెండేండ్లకు తగ్గించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిద్ధార్థ్ రెడ్డి పిటిషన్‌ను కోర్టు కొట్టివేసి హైకోర్టు తీర్పును ఖరారు చేసింది.
ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థ్ రెడ్డి సరెండర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



