- Advertisement -
- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
- నవతెలంగాణ – భిక్కనూర్
దక్షిణ కాశీ శ్రీసిద్ధిరామేశ్వర ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా మార్చి తీర్చిదిద్దేందుకు తనవంతుగా కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం శ్రీ సిద్ధరామేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ సిద్ధరామేశ్వర ఆలయానికి రాష్ట్రం నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి భక్తులు తరలి వస్తారని, తన హాయంలోనే ఆలయాలు అభివృద్ధి చెందాయన్నారు. సిద్ధిరామేశ్వర ఆలయ సమీపంలో టీటీడీ కల్యాణ మండపాన్ని నిర్మించానని, ప్రస్తుతం ఆలయ అభివృద్ధికి 10 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నూతన పాలకవర్గ సభ్యులు స్వామివారి ఆశీస్సులతో ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని, ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడి నిధులు తీసుకువస్తానన్నారు.
అనంతరం పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షెట్కార్ మాట్లాడుతూ తాను గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేశానని, నూతన ఆలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయాలని, తక్షణం ఆలయ అభివృద్ధి కోసం 5 లక్షల రూపాయలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇలియాస్, హైకోర్టు ప్రముఖ న్యాయవాది రామ్ రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షుడు లింబాద్రి, వైస్ చైర్మన్ అందే దయాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, నాయకులు నరసింహారెడ్డి, మహిపాల్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కుంట లింగారెడ్డి, ఎన్ఆర్ఐ సెల్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -