- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
నూతన మండలమైన అక్బర్ పేట భూంపల్లి జడ్పీటీసీ బరిలో మండల పరిధిలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన సిద్ధిని బాల్ లింగం నిలుస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన బాల్ లింగం గతంలో స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా అనాధాశ్రమం నిర్వహించడంతోపాటు తెలంగాణ విశ్వవిద్యాలయంలో సామాజిక సేవలో పీజీ పట్టా పొందారు. 2008 నుంచి 2010 లో జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. వార్త పత్రిక విలేకరిగా గత 12 ఏళ్లుగా ప్రజా సమస్యల కోసం కృషి చేశాడు.
- Advertisement -