నవతెలంగాణ- కంఠేశ్వర్
జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజ్యసభ సభ్యులు ఎంపీ ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కళాశాలల బైకడ్ చేయడంలో భాగంగా శుక్రవారం నిజామాబాద్ బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నవాతే ప్రతాప్ ఆధ్వర్యంలో గిరిరాజ్ కళాశాల బైకడ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నావాతే ప్రతాప్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో అన్ని కళాశాలలో స్వచ్ఛందంగా బందు నిర్వహించారు అంతేకాకుండా కొన్ని కళాశాలలను బంద్ చేసాము. కొన్ని కళాశాలలు స్వచ్ఛందంగా బందు చేయడానికి గల కారణం నిజామాబాద్ జిల్లాలో సుమారు 300 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు బకాయిలు ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా రూ..6000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ యొక్క స్కాలర్షిప్లు ఇవ్వమని యాజమాన్యాలు అడిగితే విజిలెన్స్ అధికారుల పేరుతోనే కళాశాల యాజమాన్యాలను బ్లాక్ మెయిల్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దాత్రిక రాజు, జనార్ధన్, రాకేష్ నరేష్, నగర యూత్ అధ్యక్షులు సాయి, అవధుత్ ప్రసాద్, వెంకట్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.



