Tuesday, July 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాలఉత్పత్తుల దారుల నూతన చైర్మన్ గా సిలువేరు భిక్షపతి 

పాలఉత్పత్తుల దారుల నూతన చైర్మన్ గా సిలువేరు భిక్షపతి 

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలం పెంచికల్ పహాడ్ గ్రామంలో పాల ఉత్పత్తుల దారుల సంఘం నూతన చైర్మన్ గా సిలువేరు బిక్షపతిని ఎన్నికల అధికారి గోపె మహంకాళి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన డైరెక్టర్లుగా చిన్నం ముత్యాలు, చింతల సత్యనారాయణ, బాల్ద శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా  చైర్మన్ మాట్లాడుతూ.. సంఘాన్ని అభివృద్ధి దిశలో తీసుకు వెళ్లడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని, సహకార సంఘం నుంచి లభించే సౌకర్యాలను పాడి రైతులకు సక్రమంగా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల సంఘం సభ్యులు బాల్ద రవి, చిన్నం సురేష్, సిలివేరు జంగయ్య, బాల్ద సిద్ధులు, సిలువేరు ఎల్లయ్య, గోపె మహేష్, గోపె ప్రభాకర్, సిలువేరు పాండు రమేష్, సిలువేరు మల్లయ్య, బాల్ద మహేష్  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -