- Advertisement -
హైదరాబాద్ : జాతీయ సీనియర్ డెఫ్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ అమ్మాయి భవాని రజత పతకం సాధించింది. చండీగఢ్ వేదికగా జరిగిన టెన్నిస్ పోటీల్లో భవాని చక్కటి ఆటతీరు కనబరిచింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జాఫ్రిన్ షేక్ చేతిలో 6-7, 6-10తో సూపర్ టైబ్రేకర్‌లో భవాని పోరాడి ఓడింది. సిల్వర్ మెడల్ సాధించిన భవానికి ఆమె కోచ్, డెవిస్ కప్ మాజీ ఆటగాడు వాసుదేవరెడ్డి అభినందించారు.
- Advertisement -



