ఐశ్వరీ ప్రతాప్‌కు రజతం
ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్ ఫైనల్స్
దోహా : ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో భారత యువ షూటర్ సిమ్రన్‌జిత్ కౌర్ పసిడి పతకం సాధించింది. ఆదివారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో సిమ్రన్‌జిత్ కౌర్ బంగారు పతకం గెల్చుకుంది. పతక పోరులో 41 పాయింట్లు సాధించిన సిమ్రన్‌జిత్.. అర్హత రౌండ్‌లో అంచనాలు లేకుండా బరిలోకి దిగి 585 స్కోరుతో పతక పోరుకు చేరుకుంది. ఫైనల్లో సిమ్రన్‌జిత్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. వేగంగా పుంజుకున్న సిమ్రన్‌జిత్ మూడుసార్లు పర్‌ఫెక్ట్ గురితో రేసులోకి వచ్చింది. యావో (36 పాయింట్లు) సిల్వర్, డోరిన్ (30 పాయింట్లు) బ్రాంజ్ మెడల్స్ దక్కించుకున్నారు. ఫైనల్లో హైదరాబాదీ స్టార్ షూటర్ ఇషా సింగ్ ఏడో స్థానానికి పరిమితమైంది. ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్ అర్హత్ రౌండ్‌లోనే నిష్క్రమించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ సిల్వర్ మెడల్ సాధించాడు. ఫైనల్లో 413.3 స్కోరు చేసిన ప్రతాప్ సింగ్..0.9 పాయింట్ల తేడాతో స్వర్ణం చేజార్చుకున్నాడు.
సిమ్రన్‌జిత్ పసిడి గురి
- Advertisement -
- Advertisement -



