Friday, July 25, 2025
E-PAPER
Homeఆటలుప్రి క్వార్టర్స్‌కు సింధు

ప్రి క్వార్టర్స్‌కు సింధు

- Advertisement -

చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ
హాంగ్జౌ:
చైనా ఓపెన్‌ సూపర్‌-1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్లకు రాణించారు. రెండోరోజైన బుధవారం పివి సింధు, చిరాగ్‌-సాత్విక్‌ జంట ప్రి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో పివి సింధు ఏకంగా 6వ సీడ్‌, 18ఏళ్ల మియాజకి(జపాన్‌)ను చిత్తుచేసింది. మియాజకిపై సింధు గెలుపొందడం ఇది వరుసగా రెండోసారి. హోరాహోరీగా సాగిన ఈ గేమ్‌లో సింధు 21-15, 8-21, 21-17తో మియాజకిని చిత్తుచేసింది. తొలి గేమ్‌ ప్రారంభం నుంచి సింధు అద్భుతంగా రాణించింది. తొలుత ఏకంగా ఏడు పాయింట్లు సాధించి ప్రత్యర్ధికి గుక్క తిప్పుకోకుండా చేసింది. ఇక రెండో గేమ్‌లో మియజకి ప్రారంభం నుంచి చెలరేగి 12-8 పాయింట్ల ఆధిక్యతలో నిలిచింది. ఇరువురు షట్లర్ల మధ్య జరిగిన ఈ గేమ్‌ సుమారు 62 నిమిషాలసేపు సాగింది. జపాన్‌ ఓపెన్‌ సూపర్‌-750 తొలిరౌండ్‌లో ఓడిన సింధు.. ఈసారి రాణించడం విశేషం. ఇక పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జంట జపాన్‌ జంటను వరుససెట్లలో ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ గేమ్‌లో సాత్విక్‌-చిరాగ్‌ 21-13, 21-9తో కెన్యా మిట్సుషి-హిరోకీ జంటను ఓడించారు. మలేషియా ఓపెన్‌, ఇండియా, సింగపూర్‌ ఓపెన్‌లలో భారత డబుల్స్‌ జంట సెమీస్‌ గండం దాటలేకపోయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -